Monday, December 23, 2024

న్యూడ్ కాల్‌కు బుక్కైన చర్లపల్లి డిప్యూటీ జైలర్

- Advertisement -
- Advertisement -

Charlapalli Deputy Jailor booked for nude call

బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరస్థులు
రూ.1లక్ష పంపించిన డిప్యూటీ జైలర్
మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు

మనతెలంగాణ, చర్లపల్లి: న్యూడ్ వీడియో కాల్ ముఠా బ్లాక్ మెయిల్ చేయడంతో లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు చర్లపల్లి డిప్యూటీ జైలర్. సైబర్ నేరస్థులు ఫోన్ చేసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న దశరథం స్థానికంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వాట్సాప్ కాల్ చేసిన యువతితో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడాడు. పలుమార్లు యువతితో మాట్లాడడంతో వీడియా రికార్డు చేసింది. వాటిని సైబర్ నేరస్థులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ నెల 14వ తేదీన సైబర్ నేరస్థుడు తన పేరు అజయ్ కుమార్ ఫాండే అని డిప్యూటీ జైలర్ దశరథంకు ఫోన్ చేసి యూట్యూబ్‌లో మీ న్యూడ్ వీడియో ఉందని దానిని డిలిట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వెంటనే డిప్యూటీ జైలర్ రూ.32,500 ఫోన్‌పే ద్వారా పంపించాడు.

తర్వాత మళ్లీ ఫోన్ చేసిన సైబర్ నేరస్థులు ఇంకా రెండు వీడియోలు ఉన్నాయని వాటిని రిమూవ్ చేయాలంటే రూ.65,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ జైలర్ సైబర్ నేరస్థులు ఇచ్చి బ్యాంక్ ఖాతా 52096074441, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ ఎస్‌బిఐఎన్0020362కు పంపించాడు. అయినా కూడా సైబర్ నేరస్థులు మళ్లీ ఫోన్ చేసి రూ.85,000 పంపాలని డిమాండ్ చేయడంతో వారి వేధింపులను తట్టుకోలేక కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై 420ఐపిసి, 66 సి ఐటి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News