లండన్ : కింగ్ ఛార్లెస్ 3 ను బ్రిటన్‌కు కొత్త రాజుగా ప్రకటించారు. లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెసన్ కౌన్సిల్ సమక్షాన ఆయనకు రాజరికపు అధికారాలు కట్టబెట్టారు. ఈ రాజరిక అప్పగింత కార్యక్రమం మొదటిసారి టీవీలో ప్రసారం అయింది. గురువారం క్వీన్ ఎలిజబెత్2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు , యువరాజ్ ఛార్లెస్ 3 రాజుగా బాధ్యతలు చేపట్టారు. 73 ఏళ్ల వయసులో ఈ పదవిని అలంకరించిన వ్యక్తిగా ఛార్లెస్ నూతన అధ్యాయం లిఖించారు. అయితే ఇందుకు పెద్ద క్రతువే జరుగుతోంది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించారు. ‘రాణి అస్తమయంతో ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్డర్ జార్జ్ ఇప్పుడు కొత్తరాజు (ఛార్లెస్ 3 ) అయ్యారు’ అని కౌన్సిల్ ప్రకటించింది. ఈ సమయంలో ఆయన వెంట క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా , ఆయన కుమారుడు విలియం ఉన్నారు. ఒక రాజుగా తన బాధ్యతల గురించి పూర్తి అవగాహనతో ఉన్నానని ఛార్లెస్ వెల్లడించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లి ( ఎలిజబెత్) జీవితకాలం నిస్వార్థ సేవ, ప్రేమ అందించి , నిదర్శనంగా నిలిచారన్నారు. అలాగే తన సతీమణి కెమిల్లా తనకెప్పుడూ మద్దతుగా ఉన్నారని చెప్పారు.
కొత్త రాజుగా ఛార్లెస్-3 ప్రమాణం
- Advertisement -
- Advertisement -
- Advertisement -