Friday, January 3, 2025

విభిన్న కథా చిత్రం

- Advertisement -
- Advertisement -

‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన కథా చిత్రం ‘ఛార్లి 777’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదల కానుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. రక్షిత్ శెట్టి ఇందులో ప్రధాన పాత్రధారిగా నటిస్తూ జి.ఎస్.గుప్తాతో కలిసి తన పరమ్ వహ్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. కిరణ్ రాజ్ .కె దర్శకుడు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ “ఛార్లి 777 సినిమా నటుడిగా కష్టతరమైన చిత్రమనే చెప్పాలి.

సాధారణంగా ప్రతి సినిమాలో ఛాలెంజెస్ ఉంటాయి. ఈ సినిమాలో కుక్కతో కలిసి పనిచేయడం అంటే అంత సులువు కాదు. డైరెక్టర్ కిరణ్ రాజ్ ఎంతో ప్యాషన్‌తో చేశాడు కాబట్టే ఈ సినిమా అంత చక్కగా వచ్చింది”అని అన్నారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన వెంటనే కళ్లల్లో నీళ్లు వచ్చాయి. చాలా కమర్షియల్ సక్సెస్‌లు సాధించే సినిమాలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ 170 రోజులు.. కాశ్మీర్ సహా వివిధ ప్రాంతాల్లో ఛార్లిని తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఇలాంటి ‘ఛార్లి 777’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను”అని తెలిపారు. ఈ సమావేశంలో హీరోయిన్ సంగీత శ్రింగేరి పాల్గొన్నారు.

Charlie 777 Movie Unit Press Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News