Thursday, January 23, 2025

చార్లీ చాప్లిన్ కుమార్తె జోసెఫిన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ప్రపంచ ప్రఖ్యాత హాస్య నట దిగ్గజం చార్లీ చాప్లిన్ కుమార్తె జోసెఫిన్ చాప్లిన్ తన 74వ ఏట కన్నుమూశారు. జులై 13న ఆమె ప్యారిస్‌లో మరణించినట్లు అమెరికా నుంచి వెలువడే వెరైటీ పత్రిక తెలిపింది. 1949 మార్చి 28న క్యాలిఫోర్నియాలోని మోనికాలో జన్మించిన జోసెఫిన్ చార్లీ చాప్లిన్, ఓనా ఓనీల్ దంపతులకు చెందిన ఎనిమిది మంది సంతానంలో మూడవ వ్యక్తి. జోసెఫిన్ 1952లో తన మూడవ ఏటనే తన తండ్రితో కలసి లైమ్‌లైట్ చిత్రంలో నటించారు. ఆమెకు ముగ్గురు కుమారులు-చార్లీ, ఆర్థర్, జూలియన్ రోనెట్ ఉన్నారు. జోసెఫిన్‌కు సోదరీసోదరులు మైఖేల్, గెరాల్డిన్, విక్లోరియా, జేన్, అన్నటె; యూజిన్, క్రిస్టఫర్ ఉన్నట్లు వెరైటీ పత్రిక తెలిపింది.

జోసెఫిన్ నట జీవితానికి వస్తే ఆమె అనేక చిత్రాలలో నటించారు. 1972లో పీర్ పోలో పోసోలిని నిర్మించిన అవార్డు చిత్రం క్యాంటర్‌బరీ టేల్స్‌తోపాటు అదే ఏడాది రిచర్డ్ బల్దుకీ నిర్మించిన ఎల్ ఓడూర్ డెస్ పావ్స్‌లో కూడా ఆమె నటించారు. ఎస్కేప్ ఒఏ ది సన్ చిత్రంలో కూడా మె నటించారు. 1984లో విడుదలైన కెనడియన్ చిత్రం ది బే బాయ్‌తోపాటు 1988లో టెలివిజన్ మినీ సిరీస్ హెమింగ్‌వేలోకూడా ఆమె నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News