Wednesday, January 22, 2025

పూలనే దేవతలా పూజించే పండుగ ‘బతుకమ్మ’

- Advertisement -
- Advertisement -

అధికారికంగా గుర్తించిన అమెరికాలోని ప్రాంతాలు

రంగురంగుల పూలను పేర్చి ‘బతుకమ్మ’ చుట్టూ చప్పట్లు కొడుతూ తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పాటలు పాడుతూ వేడుక చేసుకుంటారు. పూలనే దేవతలా కొలిచి తొమ్మిది రోజులు బతుకమ్మ వేడుకలు చేసుకుంటారు. ఇప్పుడు ఈ బతుకమ్మ వేడుక తెలంగాణలోనే కాదు వివిధ ప్రాంతాలకు, విదేశాలకు కూడా ప్రాకింది.

అమెరికాలో తెలుగువారు ఎక్కువగా ఉండే న్యూయార్క్, న్యూ జెర్సీ, టెక్సాస్, చికాగో, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా, వర్జీనియా, ఒహాయో, జార్జియా, ఫ్లోరిడా వంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు బతుకమ్మ పాపులర్ అయింది. అక్కడ బతుకమ్మ వేడుకలు చేసుకునే వారాన్ని అక్కడ ‘తెలంగాణ హెరిటేజ్ వీక్’ గా కొన్ని రాష్ట్రాలు గుర్తించాయి. దీనికి సంబంధించి అక్కడి గవర్నర్లు, మేయర్లు అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. దీనిపై తెలుగు ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Batukamma in US

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News