హైదరాబాద్: చార్మినార్ కు ఉండే గోడ గడియారం 135 ఏళ్ల పురాతనమైంది. కానీ దానికిప్పుడు ముప్పొచ్చింది. గడియారం బ్యాక్ గ్రౌండ్ లో తెలుపు భాగం దెబ్బతిన్నది. 25 నిమిషాలు చూపే చోట గడియారానికి రంధ్రం పడింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురావస్తు శాఖ) అది పావురాల వల్ల కలిగిన ధ్వంసం అని తెలిపినట్లు ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.
ఆ గడియారాన్ని వాహిద్ వాచ్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఆ కంపెనీ వారసులతో కలిసి ఏ మేరకు ధ్వంసం జరిగిందో చూస్తామని ఉద్యోగి ఒకరు తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ ఓ ప్రసిద్ధ స్మారకం. రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్ కు ఐదవ కుతుబ్ షాహీ రాజు 1591లో మార్చారు. నాలుగు మీనారులున్న ఆ కట్టడానికి ‘చార్మినార్’ అని పేరుపెట్టాడు. కాగా ఈ చారిత్రాత్మక కట్టడం బాధ్యతలను భారత పురావస్తు శాఖ చూసుకుంటోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం ఈ కట్టడాన్ని తన అధికారిక చిహ్నంగా మార్చింది. దాంతో పాటు కాకతీయుల వరంగల్ తోరణాన్ని కూడా చిహ్నంగా చేసింది.
The 135-year-old ancient clock on the eastern side of the 425-year-old Charminar in Hyderabad was found partly damaged. Officials discovered the damage to the dial board during ongoing renovation work. pic.twitter.com/NtBMfa71c3
— The Siasat Daily (@TheSiasatDaily) July 30, 2024