Sunday, December 22, 2024

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం.. 40మందికి గాయాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ఫ్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 40మంది ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే, పట్టాలు కొంచెం పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది.

అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పొన్నం ప్రభాకర్.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News