Saturday, November 16, 2024

చార్మిని ప్రశ్నించిన ఇడి

- Advertisement -
- Advertisement -

charmy kaur after ed interrogation on drugs case

ఆరు గంటలపాటు సాగిన విచారణ
కెల్విన్ కాల్‌లిస్ట్‌లో చార్మి పేరుపై ఆరా..!
కెల్విన్‌తో లావాదేవీలపై ప్రశ్నలు
రకుల్ అభ్యర్థనను తిరస్కరించిన ఇడి

మనతెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా ఇడి అధికారులు గురువారం సినీనటి చార్మిని దాదాపు 6 గంటల పాటు విచారించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలపై దృష్టిసారించిన ఇడి అధికారులు నటి చార్మి బ్యాంకు ఖాతాల వివరాలను పరిశీలించారు.ఈ క్రమంలో చార్మి బ్యాంకు ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు. చార్మి బ్యాంక్ అకౌంట్ నుంచి కెల్విన్ బ్యాంకు ఖాతాకు కొద్ది మొత్తాలు బదిలీ జరిగినట్లు గుర్తించిన ఇడి అధికారులు ఆదిశగా విచారించారు. అదేవిధంగా కెల్విన్‌తో పాటు మరో ఇద్దరు కెల్విన్ అనుచరుల ఫోన్లలో చార్మి ఫోన్ నంబర్‌తోపాటు బ్యాంక్ అకౌంట్ల వివరాలపై ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ జరిగిన నేపథ్యంలో టాలివుడ్‌కు చెందిన 8 మంది బ్యాంకు ఖాతా, అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా దర్యాప్తులో భాగంగానే చార్మిపై పలు ప్రశ్నలు సంధించారు.

ప్రధానంగా కెల్విన్‌తో ఉన్నడ్రగ్స్ లింక్‌లపై ఆరా తీయడంతో పాటు కెల్విన్‌తో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? కెల్విన్ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ పేరు ఎందుకు ఉందని ఆరా తీశారు. కెల్విన్ డ్రగ్స్ దందాలో మీకు భాగస్వామ్యం ఉందా? ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందని ప్రశ్నల వర్షం కురిపించారు. కెల్విన్ కాంటాక్ట్ లిస్ట్ లో చార్మి పేరు దాదా పేరిట సేవ్ చేసి గుర్తించిన ఇడి అధికారులు దాదా పేరుతో ఉన్న ట్రాన్జాక్షన్స్‌పై ఆరా తీశారు. ఇందులో భాగంగా చార్మికి చెందిన రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించి 2013 నుంచి 2018 వరకు మూడేళ్ల పాటు జరిగిన బ్యాంక్ లావాదేవీలను ఇడి అధికారులు పరిశీలించారు. అదేవిధంగా పూరీ జగన్నాథ్, చార్మి భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారని, వీరిద్దరి మధ్య డ్రగ్స్ లింక్‌లపై ఉన్న ఆధారాలపై కూడా ఇడి అధికారులు విచారణ చేపట్టారు. వీరిద్దరి మధ్య డ్రగ్స్ లింక్‌లు ఉన్నాయా? వీరితో పాటు ఇంకెవరైనా సహకరించారా? అనే విషయాలు రాబట్టారు. 2017లో డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్న చార్మి ప్రశ్నించిన ప్రశ్నలకు భిన్నంగా ఇడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రధాన నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇడి నటి చార్మిని విచారించారు. నటి చార్మి. ఆమెతో తన సీఏ సతీష్ హాజరై బ్యాంకు ఖాతాలను సమర్పించారు.

విచారణకు సహకరించాను : నటి చార్మి

ఇడి విచారణాంతరం చార్మి మీడియాతో మాట్లాడుతూ విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.‘ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యానని, అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు. అధికారుల దర్యాప్తునకు అన్ని విధాలా సహకరిస్తానని, విచారణలో భాగంగా అధికారులు అడిగిన బ్యాంక్ పత్రాలు సమర్పించినట్లు తెలిపారు.

రకుల్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసిన ఇడి

డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తన విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఇడి కి రకుల్ ప్రీత్ సింగ్ లేఖ రాసింది. అనివార్య కారణాల వల్ల ఈనెల 6వ తేదీన విచారణకు హాజరు కాలేనంటూ అధికారులను రకుల్ కోరింది. తాను హాజరు అయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే రకుల్ రిక్వెస్ట్‌ను ఇడి అధికారులు రిజెక్ట్ చేశారు. ముందుగా నోటీసులు ఇచ్చిన ప్రకారం ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందేనని ఇడి స్పష్టం చేసింది. కాగా గతంలో ఎక్సైజ్ అధికారులు విచారణ జరిపిన సమయంలో అందులో రకుల్ పేరు లేదు. తాజాగా ఇడి అధికారుల లిస్ట్‌లో మాత్రం ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ కేసుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన ఇడి ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్,చార్మిలను విచారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News