Thursday, December 19, 2024

వాహనంలో కట్టేసి బతికుండగానే తగలబెట్టారు…

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: బతికుండగాను ఇద్దరు వ్యక్తులను వాహనంలో కట్టేసి తగలబెట్టిన సంఘటన హర్యానా రాష్ట్రం భివాని జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బరావాస్ గ్రామంలో బొలేరో వాహనంతో సహా రెండు మృతదేహాలు కాలిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బొలేరో పూర్తిగా కాలిపోయి ఉండడంతోపాటు ఈ వాహనానికి నంబర్ ప్లేటు లేకపోవడంతో మృతులు ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది. వాహనం ఇంజన్‌కు ఉండే నంబర్ ఆధారంగా గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.

సిఐఎ, ఎఫ్‌ఎస్‌ఎల్ టీమ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నాయని డిఎస్‌పి జగత్‌సింగ్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు వాహనానికి కట్టేసి తగలబెట్టి ఉంటారని డిఎస్‌పి అనుమానం వ్యక్తం చేశాడు. స్థానిక ప్రాంతంలో ఉన్న సిసి టివి ఫూటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు నజీర్, జునైడ్ గుర్తించినట్లు డిఎస్‌పి ప్రాథమికంగా వెల్లడించారు. ఇద్దరిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News