Monday, December 23, 2024

మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

కువైట్ లోని మంగాఫ్‌లో ఉన్నభవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలోని మృతుల్లో 42 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి. దాంతో వాటి గుర్తింపు కోసం డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం అందిస్తామని, వాయుసేన విమానం ఆ మృతదేహాలను స్వదేశానికి తీసుకు వస్తుందని ఆయన చెప్పారు.

ఈ సంఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగు లోకి వచ్చాయి. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకోడానికి కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. తలుపుకు తాళం వేసి ఉండటంతో వారు భవనం పైభాగానికి వెళ్ల లేక పోయినట్టు పేర్కొంది. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్ని ప్రమాద మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపేలా చూడాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News