Monday, January 20, 2025

వరలక్ష్మీ శరత్ కుమార్ ‘చేజింగ్’

- Advertisement -
- Advertisement -

Chasing movie teaser release

 

టాలెంటెడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో.. ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘చేజింగ్’. కె. వీరకుమార్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరిటాల రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్.. నిర్మాత రామసత్యన్నారాయణ సంయుక్తంగా ఈ టీజర్‌ను విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వి. సముద్ర మాట్లాడుతూ.. “వరలక్ష్మీ శరత్ కుమార్‌తో నేను కూడా పనిచేశాను. మంచి టాలెంటెడ్ నటి. ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి.

ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించి, టీమ్‌కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర నిర్మాతలు జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి మాట్లాడుతూ.. “ఇది మా కాంబినేషన్‌లో మొదటి సినిమా అయినా.. ఖర్చు విషయంలో ఎక్కడా వెనుకాడలేదు. మరిన్ని సినిమాలు తెలుగు, తమిళ్‌లో తీయాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు ప్రభాకర్, చిత్ర దర్శకుడు కె. వీరకుమార్, నటులు రంగరాజు, అప్సర్ ఆజాద్.. దర్శకుడు నగేష్ నారదాసి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News