- Advertisement -
న్యూఢిల్లీ : చాట్ జిపిటి వంటి ఎఐ(కృత్రిమ మేధ) ఆధారిత చాట్‌బాట్స్ మనిషి మెదడును ఎప్పటికీ భర్తీ చేయలేదని సాఫ్ట్‌వేర్ దిగ్గజం సహ వ్యవస్థాపకుడు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. చాట్ రచయితలు, కోడింగ్, ఇతర వృత్తి నిపుణులను ఎఐ భర్తీ చేస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. చాట్‌బాట్స్ వల్ల అనేక ఉద్యోగాలకు ముప్పు ఉందంటూ వస్తున్న ఆరోపణలపై మూర్తి ఈ విధంగా స్పందించారు. అలీబాబా, బైడు వంటి ఇతర టెక్నాలజీ కంపెనీలు చాట్ జిపిటితో స్ఫూర్తిని పొంది కొత్త వెర్షన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని ఆయన అన్నారు. చాట్ జిపిటి అద్భుతమైనదేనని, అయితే మనిషి మెదడును అధిగమించలేదని అన్నారు.
- Advertisement -