Friday, December 20, 2024

చాట్ జిపిటి సంచలనం.. వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ రోజుల్లో సాంకేతిక ప్రపంచంలో ఒక పదం ప్రకంపనలు సృష్టిస్తోంది. అదే ‘చాట్‌జిపిటి’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఈ చాట్‌బాట్ చాట్ జిపిటి(జనరేటివ్ ప్రీ-ట్రెంట్ ట్రాన్స్‌ఫార్మర్) గత ఏడాది నవంబర్ 30న ప్రారంభించారు. జనవరిలో దాని నెలవారీ క్రియాశీల వినియోగదారులు 100 మిలియన్లు అయ్యారు. దీంతో ఇది ఇంటర్నెట్ చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినియోగదారు అప్లికేషన్‌గా మారింది. జనవరిలో రోజుకు 1.3 కోట్ల మంది వినియోగదారులు చేరారు. ఇంత వేగంగా వినియోగదారులు చేరుతున్న ఈ యాప్ పట్ల ఆందోళనలు కూడా పెరిగాయి. ఎందుకంటే, అనేక వైట్ కాలర్ ఉద్యోగాలు చాట్‌జిపిటి వల్ల నుండి ప్రమాదంలో పడనున్నాయి. విద్యాసంస్థల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ ముప్పు సమీప భవిష్యత్తులో లేనప్పటికీ, భవిష్యత్‌లో ఆందోళన కల్గిస్తుందని భావిస్తున్నారు. నిజానికి, చాట్‌జిపిటికి అనేక పరిమితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం 2021 వరకు మాత్రమే డేటాను ఇస్తుంది.

సృష్టికర్త తన సొంతం ప్రకారం తయారు చేశారు. అంటే దాని సమాచారం పక్షపాతానికి గురవుతుంది. తప్పుడు సమాధానాలు కూడా ఉన్నాయి. అందువల్ల తక్కువ విశ్వసనీయత ఉంది. ఇది ఇప్పటికే ఉన్న డేటా ఆధారంగా మాత్రమే నమూనాను రూపొందిస్తుంది. రానున్న కాలంలో ఇది వేగంగా వృద్ధి చెందుతుంది కావున చాలా ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. అదే సంక్షోభం భారత్‌పై కూడా ఉంది. దీనికి అనుగుణంగా మానవశక్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి అవసరం ఏర్పడుతుంది. కంప్యూటర్ వచ్చినప్పడు ఉద్యోగాలు పోతాయన్నారు, కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. పనులు వేగవంతమయ్యాయి. చాట్‌జిపిటి వృధా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. చాట్‌జిపిటి వంటి సాధనాలతో సమీప భవిష్యత్తులో ఉత్పాదకత చాలా పెరగబోతోంది. ఫోర్బ్ ప్రకారం, ఎఐ స్టార్టప్‌ల సంఖ్య 14 రెట్లు పెరిగింది.72 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు భవిష్యత్తులో వ్యాపారంలో ఎఐ అత్యంత ముఖ్యమైన భాగం అవుతుందని భావిస్తున్నారు.

చాట్‌జిపిటి ఈ ఉద్యోగాల వైపు అడుగులు

టెక్ ఉద్యోగాలు (కోడర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వెబ్ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, డేటా విశ్లేషకులు), మీడియా ఉద్యోగాలు (కంటెంట్ క్రియేషన్, అడ్వర్టైజింగ్, టెక్నికల్ రైటింగ్, జర్నలిజం), లీగల్ ఇండస్ట్రీ ఉద్యోగాలు (పారాలీగల్స్, అసిస్టెంట్లు), మార్కెట్ పరిశోధన విశ్లేషకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, ఆర్థిక ఉద్యోగాలు (ఆర్థిక విశ్లేషకులు, సలహాదారులు), వ్యాపారులు, షేర్ అనలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్లు, అకౌంటెంట్లు
కస్టమర్ సర్వీస్ ఏజెంట్ వంటివి చాట్ జిపిటిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News