Monday, December 23, 2024

చాట్‌జిపిటి సంచలనం

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: సాంకేతిక యుగంలో సరికొత్త సంచలనమైన చాట్‌జిపిటి అరుదైన నికార్డును సొంతం చేసుకుంది. కృత్రిమ మేధ (ఎఐ) ఆధారంగా పని చేసే ఈ యాప్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా అవతరించింది. ఈ చాట్‌బోట్ కేవలం రెండు నెలల్లోనే 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంది. చాట్‌బోట్ జనవరిలో రోజుకు 13 మిలియన్ల మంది యూజర్లను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ సహా ఇతర సోషల్ మీడియా యాప్‌లను అధిగమించి తక్కువ సమయంలోనే 100 మిలియన్ యూజర్లను దక్కించుకున్న యాప్‌గా ఘనత సాధించింది. ఇతర యాప్‌లు ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గత ఏడాది డిసెంబర్‌లోనే చాట్ జిపిటిని తీసుకొచ్చారు.దీనిని అభివృద్ధి చేసేందుకు ఎలాన్ మస్క్ కూడా పెట్టుబడులు పెట్టారు. కృత్రిమ మేధ ఆధారంగా పని చేసే ఈ యాప్ యూజర్‌కు అవసరమైన సమాచారాన్ని కచ్చితత్వంతో చూపిస్తుంది. అందుకే అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. గత ఇరవై ఏళ్లుగా ఇంత వేగంగా వినియోగదారులకు చేరువైన యాప్ లేదని యుబిఎస్ రిసెర్చ్ వెల్లడించింది. గత వారం రోజులుగా రోజుకు 25 మిలియన్ల మంది వీక్షకులు ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

కాగా చాట్‌బోట్ వినియోగం పెరిగిపోతే గూగుల్ సహా ఇతర ఇంటర్నెట్ దిగ్గజాల వృద్ధి రేటు ఆందోళనకరంగా మారుతుందన్న వార్తలు ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో చాట్‌పిజి తరహా సేవలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. కృత్రి మేధ సాయంతో రూపుదిద్దుకున్న మరోస్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్‌లో దాదాపు రూ.3,289కోట్ల పైచిలుకు 400 మిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టినట్లు కూడా సమాచారం.కానీ ఆంథ్రోపిక్స్‌లో పెట్టుబడులు విషయంలో అటు గూగుల్ కానీ, ఇటు ఆంథ్రోపిక్స్‌కానీ స్పందించడానికి నిరాకరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News