Friday, January 10, 2025

ఎఐతో ఉద్యోగాలకు ముప్పే..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ఉద్యోగాలు పోతాయంటూ చాట్‌జిపిటి సృష్టికర్త, ఓపెన్ ఎఐ సిఇఒ సామ్ అల్త్‌మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఐ వల్ల జాబ్ మార్కెట్ ఎదుర్కొనే పర్యవసానాలు, ప్రమాదంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చాట్ జిపిటితో ఉద్యోగాలకు ఉంటే ముప్పుకు కారణం కావొచ్చంటూ ఆయన బహిరంగంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొందరు, చాట్‌జిపి పూర్తిగా మానవ వనరులను భర్తీ చేస్తుందని చెబుతుంటే,

మరికొందరు మనుషుల అవసరం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతున్నారు. అదే సమయంలో ఎఐ చాట్‌బాట్ వల్ల ఉద్యోగాలు కోల్పోయామని చెబుతున్న వారు కూడా ఉన్నారు. ఈ చర్చల నేపథ్యంలో అధునాతన ఎఐ సాంకేతికతపై అల్త్‌మాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలను కూడా విస్మరించకూడదు. ఇటీవల ఇంటర్వూ సందర్భంగా చాట్‌జిపిటి సిఇఒ పలు కీలక అంశాలు, వాటి పర్యావసానాలపై వివరణ ఇచ్చారు.
ప్రయోజనాలు కూడా ఉన్నాయ్
చాట్‌జిపిటితో సహా ఎఐ ప్రభావం వల్ల ఉద్యోగాలపై ప్రభావం ఉందని ఓపెన్‌ఎఐ సిఇఒ సామ్ అన్నారు. అదే సమయంలో దీని వల్ల గణనీయమైన పురోగతి చూస్తామని, సమాజానికి సవాళ్లు కూడా ఉంటాయని తెలిపారు. మానవ ఉత్తమ ప్రయోజనాల కోసం ఎఐ అభివృద్ధి దిశలో జాగ్రత్తతో కూడిన పరిశీలన, నియంత్రణ అవసరమవుతుంది. ఉద్యోగ మార్కెట్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా సానుకూల పురోగతి కోసం ప్రయత్నించాలని ఆయన తెలిపారు.

ఎఐపై చాట్‌జిపిటి సిఇఒ చెప్పిన ఐదు కీలక అంశాలు
1. చాట్‌జిపిటి అభివృద్ధి, పరిమితులు
2022 నవంబర్‌లో ప్రారంభించినప్పటి నుంచి చాట్‌జిపిటిలో గణనీయమైన పురోగిత చూస్తున్నామని, అభివృద్ధి కొసాగుతుందని అల్త్‌మాన్ అన్నారు. ఎఐ టూల్ పరిపూర్ణమైందేమీ కాదు, దానికి పరిమితులు ఉన్నాయి.
2. ఎఐతో ఉద్యోగాల భర్తీ
ఎఐ గురించి అల్త్‌మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవుల ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభిస్తుందని అన్నారు. భవిష్యత్‌లో మనుషుల స్థానంలో వచ్చే చాటాజిపిటి వంటి ఎఐ పరికరాల పట్ల టెక్ నిపుణులతో పాటు అనేకమంది తమ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కేసుల్లో ఇది ఇప్పటికే ప్రారంభించింది కూడా అని చెబుతున్నారు.
3. మనుషులపై ఎఐ ప్రభావం
మనుషులపై ఎఐ ప్రభావం పూర్తిగా సానుకూలం కాకపోవచ్చని అట్లాంటిక్‌తో ఇచ్చిన ఇంటర్వూలో అల్త్‌మాన్ హెచ్చరించారు. అదే సమయంలో కొంతమంది డెవలపర్లు చెప్పేదేమిటంటే, ఎఐ మనిషి ప్రయత్నాలకు అనుబంధంగా ఉంటుందే గానీ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అయితే అల్త్‌మాన్ మాత్రం ఉద్యోగాలు తప్పనిసరిగా ప్రభావితమవుతాయని అంటున్నారు.
4. మరిత శక్తివంతమైన ఎఐ ఆవిష్కరణ
చాట్‌జిపిటి కంటే మరింత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ)ని సృష్టించే సామర్థం ఓపెన్‌ఎఐకి ఉందని, అయితే వెంటనే విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్టు అల్త్‌మాన్ వెల్లడించారు. అటువంటి గణనీయమైన పురోగతికి ప్రజలు సిద్ధంగా ఉండకపోవచ్చని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అన్నారు.
5. భారత్, ఎఐ భవిష్యత్
భారతదేశంలో పర్యటించిన సమయంలో ఒక విషయాన్ని గమనించానని చాట్ జిపిటి సిఇఒ అల్త్‌మాన్ చెప్పారు. అదేమిటంటే, ఎఐ వల్ల ఉద్యోగులు మాయం అవుతున్నాయని, ఇది ఆందోళనకరమని అన్నారు. కానీ వీటి స్థానంలో సరికొత్త, మెరుగైన ఉద్యోగాల సృష్టి జరుగనుందని అన్నారు. ఎఐ పట్ల భారత్‌లో ఉన్న ఆసక్తిని అల్త్‌మాన్ ప్రశంసించారు. దేశంలోని ఎఐ స్టార్టప్‌లకు మద్దతు అందించేందుకు ఓపెన్‌ఎఐ యోచిస్తోందని ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News