Monday, December 23, 2024

2024లో చాట్‌జిపిటి డెవలపర్ ‘ఓపెన్‌ఎఐ’ దివాలా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చాట్‌జిపిటిని అభివృద్ధి చేసిన కంపెనీ ఓపెన్‌ఎఐ వచ్చే ఏడాది(2024) దివాలా తీయవచ్చు. కంపెనీ చాట్‌జిపిటి నిర్వహణ కోసం ప్రతిరోజు 7 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ.5.80 కోట్లు ఖర్చు చేస్తోందని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ఒక నివేదిక వెల్లడించింది. ఈ ఖర్చును మైక్రోసాఫ్ట్, ఇతర ఇన్వెస్టర్లు భరిస్తున్నారు. అయితే చాట్‌జిపిటిని డెవలప్ చేసిన ఓపెన్‌ఎఐ వీలైనంత త్వరగా లాభాల్లోకి రాకుండా కంపెనీ, ఇన్వెస్టర్లు నష్టాల్లో కూరుకుపోవచ్చని నివేదిక తెలిపింది. జిపిటి3.5,

జిపిటి4 చెల్లింపు సేవలను ప్రారంభించిన తర్వాత కూడా కంపెనీ తన ఖర్చులను కవర్ చేయడానికి తగినంత ఆదాయాన్ని పొందలేకపోయింది. నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఓపెన్‌ఎఐలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి (రూ. 83,000 కోట్లు) పెట్టడం వల్ల కంపెనీ మనుగడ సాగిస్తోంది. ఓపెన్‌ఎఐ 2023లో 200 మిలియన్ డాలర్లు (రూ. 1660 కోట్ల) వార్షిక ఆదాయాన్ని అంచనా వేసింది. 2024లో ఆదాయం 1 బిలియన్ డాలర్లు (రూ.8,200 కోట్ల)కు చేరుకుంటుందని అంచనా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ ఈ ఆదాయాన్ని చేరుకోవడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

కంపెనీ నష్టం రెండింతలు
ఓపెన్‌ఎఐ 2022 నవంబర్‌లో చాట్‌జిపిటిని ప్రారంభించింది. అప్పటి నుండి 2023 మే వరకు కంపెనీ 540 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.4,479 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అదే సమయంలో చాట్‌జిపిటి వినియోగదారులలో కూడా క్షీణత కనిపిస్తోంది. జూన్‌తో పోలిస్తే 2023 జూలైలో చాట్‌జిపిటి వినియోగదారులు 12 శాతం తగ్గారు. జూలైలో 1.7 బిలియన్ల వినియోగదారులు ఉండగా, అది 1.5 బిలియన్లకు తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News