Friday, January 10, 2025

ఇటలీలో చాట్‌జిపిటిపై నిషేధం

- Advertisement -
- Advertisement -

రోమ్: కృత్రిమ మేధ (ఎఐ)తో కూడిన కంప్యూటర్ అప్లికేషన్ ప్రంపచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాంకేతికరంగంలో చాట్‌జిపిటి ప్రవేశంపై నిపుణుల మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టెక్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై చాట్‌జిపిటి తీవ్ర ప్రభావం చూపుతోందని కొంతమంది నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఐరోపా దేశం ఇటలీ చాట్‌జిపిటిపై నిషేధం విధించింది. దీంతో ఈ అప్లికేషన్‌ను ఇటలీ అధికారుల ఆదేశాల మేరకు బ్లాక్ చేశారు. చాట్‌జిపిటిని బ్లాక్ చేస్తున్నట్లు ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ తెలిపింది. నిషేధించిన మొదటి దేశంగా నిలిచింది. చాట్‌జిపిటి గత ఏడాది చివరిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. టెక్ దిగ్గజ సంస్థలన్నీ చాట్‌జిపిటి వినియోగంపై దృష్టి కేంద్రీకరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News