Wednesday, January 22, 2025

10 పాయింట్లతో మార్కెట్లో లాభాలు

- Advertisement -
- Advertisement -

మదుపరులకు ఉపయోగపడే ‘చాట్ జిపిటి’ సూచనలు

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం, యుద్ధ పరిస్థితుల కారణంగా స్టాక్‌మార్కెట్ గత సంవత్సరం అస్థిరంగా ఉంది. కానీ ఈ సంవత్సరం మార్కెట్ మెరుగుపడింది. ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టనుందని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో కూడా బుల్ రన్ తిరిగి వస్తుందని అంచనా వేయడానికి ఇదే కారణం. అయితే గత కొన్ని రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ)పై దుమారం రేగుతోంది.

ఎఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో లాభాలు, నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నియంత్రణ లేకపోతే ఎఐతో ముప్పు ఎక్కువని సూచిస్తున్నారు. అయితే సరియైన విధంగా వినియోగించుకుంటే ఎఐతో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మదుపరులకు పెట్టుబడి సలహాల గురించి ప్రశ్నించినప్పుడు చాట్ జిపిటి మెరుగైన సలహాలు ఇస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

సంపాదించడానికి మార్కెట్ అవకాశాలు
ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మంచి రాబడిని పొందడానికి స్టాక్‌మార్కెట్ గొప్ప సాధనంగా ఉంది. సరైన పరిశోధన చేసి, విభిన్నమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించినట్లయితే సులభంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించవచ్చు. తద్వారా ఎఫ్‌డిల వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ల కంటే మెరుగైన రాబడిని కూడా పొందవచ్చు.

మంచి స్టాక్‌ల ఎంపిక ఎలా?
మంచి రాబడులు ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్‌లను ఎలా ఎంచుకోవాలి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. దీనికి కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా మంచి స్టాక్‌లను ఎంచుకోవచ్చు. ఈ ప్రమాణాలతో సామర్థం ఉన్న స్టాక్‌లు పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇస్తాయి. దీంతో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జిపిటి ఈ 10 పాయింట్లతో స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారులకు సహాయం చేయడానికి ప్రయత్నించింది.

10 పాయింట్లు ఇవే..
పరిశోధన: తాజా వార్తలు, ఆర్థిక నివేదికలు, మార్కెట్ ట్రెండ్‌లతో అప్‌డేట్‌గా ఉండాలి.
అస్థిరత: మెరుగైన స్టాక్‌లను కనుగొనండి, వీటి ధరలు మరింత అస్థిరంగా ఉంటాయి. ఇటువంటి షేర్లు గొప్ప ట్రేడింగ్ అవకాశాలను అందిస్తాయి. అయితే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది.
లిక్విడిటీ: అధిక ట్రేడింగ్ వాల్యూమ్ ఉన్న స్టాక్‌లను ఎంచుకోండి.
సాంకేతిక విశ్లేషణ: మూవింగ్ యావరేజ్, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, బోలింగర్ బ్యాండ్స్ వంటి సాంకేతిక విశ్లేషణలు స్వల్పకాలంలో మంచి రాబడిని ఇవ్వగల స్టాక్‌లను గుర్తించడానికి ఉపయోగించవచ్చు.
రంగాల వారీగా విశ్లేషణ: డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించండి.
ఆదాయ ప్రకటనలు: కంపెనీల త్రైమాసిక ఫలితాలపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే అవి స్వల్పకాలిక ధరలపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి.
రిస్క్ మేనేజ్‌మెంట్: పెద్ద మొత్తంలో సంపాదించాలనే ఒత్తిడి చెందొద్దు. ఎంత సంపాదించాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకుని, అంత రాబడి వచ్చిన వెంటనే నిష్క్రమించండి. ఎక్కువ కోసం అత్యాశకు పోతే సాధించుకున్నది కోల్పోయే ప్రమాదం ఉంది.
డైవర్సిఫికేషన్: రిస్క్‌ను తగ్గించడానికి వివిధ రంగాలు, స్టాక్‌లలో పెట్టుబడి పెట్టండి.
నిపుణులను సంప్రదించండి: ఇది ఉత్తమ పరిష్కారం. మార్కెట్ నిపుణులు, అనుభవజ్ఞుల నుండి సలహా తీసుకోండి.
పేపర్ ట్రేడింగ్: మార్కెట్‌కి కొత్తవారైతే లేదా ఏదైనా వ్యూహం గురించి సందేహాలు ఉంటే, పేపర్ ట్రేడింగ్ అంటే మాక్ ట్రేడింగ్ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News