Friday, December 20, 2024

రూ.10 కోసం కుమారుడి ప్రాణం తీసిన తండ్రి

- Advertisement -
- Advertisement -

రాంఛీ: పది రూపాయలు అడిగాడని కుమారుడిని తండ్రి గొంతు నులిమి చంపిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ఛత్రా జిల్లాలోని బషిష్టానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాంఛీలో 200 కిలో మీటర్ల దూరంలో కరైలిబార్ గ్రామంలో బిలేష్ భూయాణ్ అనే వ్యక్తి తన కుటుంబం కలిసి జీవిస్తున్నాడు. బిలేష్‌కు పప్పుకుమార్ అనే తనయుడు(12) ఉన్నాడు. పది రూపాయలు ఇవ్వమని తండ్రిని కుమారుడు అడిగాడు. లేదని తండ్రి చెప్పడంతో కుమారుడు మళ్లీ అడగడంతో కోపంతో కుమారుడి గొంతును నులిమి తండ్రి చంపాడు. 15 ఏళ్ల సోదరి ఇంటికి వచ్చేసరికి తమ్ముడు అచేతనంగా పడి ఉండడంతో కేకలు వేసింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: లగ్జరీ కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News