Wednesday, January 22, 2025

మైనర్‌పై ముగ్గురు యువకుల అత్యాచారం

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : బాలికకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఛత్రినాక పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మందుల కోసమని ఈనెల 4న ఒక బాలిక మందుల దుకాణం వద్దకు వచ్చింది. దుకాణం వద్దే ఉన్న ఒక యువతి ఆమెకు తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానని చెప్పి మైనర్ బాలికను కందికల్ బోయిగూడలోని ఒక ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు అప్పటికే గంజాయి సేవించారు. మత్తులో ఉన్న వారు బాలికతో హుక్కా, ఆ తరువాత కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించారు.

మ్యూజిక్ సిస్టమ్‌లో పెద్దగా ధ్వని పెంచి ఆ తరువాత ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించ సాగారు. ఆ శబ్ధంలో ఆమె పెట్టిన కేకలు వినిపించలేదు. బాలిక మత్తులోకి వెళ్లిన తరువాత ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఎలాగోలాగ వారి చెర నుంచి బయటపడ్డ బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి బాదితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ముగ్గురు యువకులతో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News