Monday, December 23, 2024

సమ్మక్క సాగర్‌ను పరిశీలించిన చత్తీస్‌గఢ్ బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోదావరి నదిపైన ములుగు జిల్లాలో నిర్మిస్తున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టును చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల తీరును పరిశీలన చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా గోదావరి నది బ్యాక్ వాటర్ వల్ల తమ రాష్ట్రంలోని భూబాగం మునకకు గురువుంతుందన్న అభిప్రాయాలను చత్తిస్‌గడ్ ప్రభుత్వం కేంద్ర జలసంఘం ముందు వెలిబుచ్చింది. దీంతో సమక్కబ్యారేజికి సంబంధించిన డిపిఆర్ పట్ల కొంత జాప్యం ఏర్పడింది. కేంద్ర జలసంగం సూచన మేరకు చత్తిస్‌గఢ్ బృందానికి గురువారం పర్యటనలో రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించారు. సమ్మక బ్యారేజి వల్ల చత్తిస్‌గఢ్ రాష్ట్రానికి ఎటువంటి నష్టం వాటిల్లదని వివరించారు. చత్తిస్‌గఢ్ ఇంజనీర్ల బృందం సంతృప్తిని వెలిబుచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News