సిటీ బ్యూరో ః ఎర్నస్టో చేగువేరా గెరిల్లా పోరాట యోధుడు , దైర్యశాలి కాకుండా మానవత్వం మూర్తీవభించిన మహనీయులని ఆఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ కొనియాడారు. చేగువేరా 95వ జయంతి వేడుకులను ఎఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఘన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలై రామన్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్రలు చేగువేరా చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం తిరుమలై రామన్ మాట్లాడుతూ క్యూబాలో జన్మించిన చేగువీరా కేవలం తన దేశంలోనే కాకుండ అనేక దేశాలు పర్యటించి పెట్టుబడి దారి వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడని కొనియాడారు.
100 పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజమని, ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షకు అద్దం పడుతుందన్నారు. చేగువేరా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలను నిర్వహించారన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో క్యూబా వైద్యులు పర్యటించి కరోనా భారిన పడిన వారికి వైద్య సేవలను అందించి న మానవతావాదులుగా నిలిచారని, దీనికి కారనం చేగువేరా దార్శనికత అని, క్యూబాలో 80 శాతానికి పైగా ప్రజానీకం వైద్యులేనని తెలిపారు. అయితే చేగువేరా తన జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి
వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్‌గా మార్చేసి ఆయన పేరు మీద నేటికి వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకమని తిరుమలై రామన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ హైదారబాద్ జిల్లా అధ్యక్షులు కమతం యాదగిరి, కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర సమతి సభ్యులు శ్రీమాన్, నాయకుకళ్యాణ్, ముఖేష్, జగన్, సందీఫ్, వినోద్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.