Sunday, December 22, 2024

చేగువేరా పోరాటాలు, త్యాగాలు….

- Advertisement -
- Advertisement -

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం ‘చే‘ లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. క్యూబా తరువాత ప్రపంచంలో తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బియోపిక్ ఇది. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 9న క్యూబా పోరాటయోధుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది. అనంతరం హీరో , దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. ‘చేగువేరా చేసిన పోరాటలు, త్యాగాలు ఈ చిత్రంలో తీశాము. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపోందించాం‘ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News