Saturday, November 23, 2024

కర్ణాటక రాష్ట్ర డీజిల్‌తో భలేమంచి చౌక బేరం

- Advertisement -
- Advertisement -

మాగనూర్: కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా డీజిల్ దిగుమతిచేసుకుని చౌకగా దొరుకుతుందని క్రషర్‌యాజమానులు, ఇటుకబట్టీల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రం ఒక పెట్రోల్ బంకు యజమాని నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల ద్వార అక్రమ రవాణాతో తమకు నష్టం వాటిల్లుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మాగనూర్, కృష్ణ మండలాల పరిధిలోని పెట్రోల్ బంకుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెలితే కర్ణాటక రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్‌ధరలు మనరాష్ట్రంకంటే తక్కువగా ఉండటంతో అక్రమార్కులు సరిహద్దు ప్రాంతంలోని కర్ణాటక రాష్ట్రం నుంచి ట్యాంకర్ ద్వార డీజిల్ దిగుమతి చేసుకుని క్రషర్ యాజమానులకు, ఇటుకబట్టిల యాజమానులు చౌకగా డీజిల్ లభిస్తుందని కర్ణాటకరాష్ట్రం నుంచి అక్రమంగా మన రాష్ట్రానికి తరలిస్తున్న ట్యాంకర్లద్వార కొనుగోలుచేస్తుండడంతో ఉభయ మండల పరిధిలోని పెట్రోల్‌బంకులు వ్యాపారం నష్టపోయే పరిస్ధితి నేలకొందని తెలిసింది. కర్ణాటక రాష్ట్రంలో డీజిల్‌ధరరూ.87.84 పైసలుఉండగా తెలంగాణలో డీజిల్‌ధర రూ.99.51 ఉంది సుమారుగా మనరాష్ట్రంలో కంటే కర్ణాటకరాష్ట్రంలో డీజిల్ ధర 12 రూ పాయాలు ఉభయ మండలాలలోని క్రషర్,ఇటుకబట్టిలు, టిప్పర్ల యాజమానులు కర్ణాటక రాష్ట్రంలోని పెట్రోల్ బంక్ యాజమాని నుంచి ప్రతిరోజు 5వేల లీటర్ల దాక డీజిల్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ అక్రమ రవాణా వల్లన కర్నాటక రాష్ట్ర బంక్ యజమానికి కాసుల పంట కురుస్తుండగా మనరాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్‌కు గండిపడుతుంది.

పెట్రోల్ , డీజిల్ వ్యాపారాలను నియంత్రి ంచే పౌరసరఫరాల విభాగం అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో డీజిల్ అక్రమ దందా ఎవరికి భయకుండా దర్జగా కొనసాగిస్తున్నారు. అక్రమ డీజిల్ దిగుమతి వలన తమకు తీరని నష్టం జరుగుతుందని అధికారుల దృష్టికితీసుకుని వెళ్లిన స్పందించడం లేదని బంకు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన పౌర సరఫరాల అధికారులు డీజిల్ అక్రమ దిగుమతిపై నిఘూ ఉంచి రాష్ట్ర ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపట్టే అవసరం ఎంతైన ఉంది. అక్రమ డీజిల్ దిగుమతి విషయంలో తమకుఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News