Wednesday, January 22, 2025

సినీ నిర్మాత బెల్లంకొండపై ఛీటింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

FIR against Bellamkonda Suresh

 

హైదరాబాద్: సినిమా నిర్మాణానికి డబ్బులు తీసుకుని ఇవ్వకపోవడంతో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై నగర సిసిఎస్ పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా నిర్మాణం కోసం 2018లో బంజారాహిల్స్‌కు చెందిన శరణ్ అనే వ్యక్తి నుంచి రూ.85లక్షలు అప్పు తీసుకున్నారు. సినిమా నిర్మాణం పేరుతో 2018లో రూ.50లక్షలు, తర్వాత గోపీంచ్ మలినేని డైరెక్షన్‌లో మరో సినిమా తీస్తున్నామని చెప్పి రూ.35లక్షలు తీసుకున్నాడని శరణ్ ఆరోపించారు. ఇలా తన వద్ద నుంచి రూ.85,00,000 తీసుకున్నాడని శరణ్ ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగి డబ్బులు తిరిగి ఇవ్వలేదని, దీంతో కోర్టులో ఫిటీషన్ దాఖలు చేశానని తెలిపాడు. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News