Wednesday, April 16, 2025

ఎంఎల్ఎ మర్రి రాజశేఖర్‌రెడ్డిపై చీటింగ్ కేసు

- Advertisement -
- Advertisement -

హాస్పిటల్‌కు సామగ్రి ఉపయోగించుకొని చెల్లించాల్సిన బకాయిని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న టిఆర్‌ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. పేట్ బషీరాబాద్ పోలీస్ పరిధి జీడిమెట్ల విలేజ్‌లో ఉండే హౌస్ కీపింగ్ కాంట్రాక్టర్ ఏసుబాబుకు చెందిన సంస్థ నుండి ఎమ్మెల్యేకు సంబంధించిన అరుంధతి ఆసుపత్రిలో క్లీనింగ్ కాంట్రాక్టు కింద 50 లక్షల రూపాయల పనులు జరిగాయి. దీనికి సంబంధించిన బకాయి, డబ్బులు చెల్లించకుండా ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నాడంటూ యేసుబాబు అనే వ్యక్తి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు స్పందించిన పోలీసులు మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పై విచారణ జరిపారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీస్‌ను రూ. 20 లక్షలు మోసం చేశారంటూ మర్రి రాజశేఖర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.

విజన్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీస్ ద్వారా అరుంధతి హాస్పిటల్‌కు 40 మంది సిబ్బంది కేటాయింపు జరిగిందని, వారు పనులు చేశారని మొత్తం రూ.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్న రాజశేఖర్‌రెడ్డి పలు దఫాలుగా రూ.30 లక్షలు చెల్లించి మిగతావి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ డబ్బులు ఇవ్వాలని అడిగితే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బాధితున్ని బెదిరించాడని ఏసుబాబు తెలిపారు. దీంతో దిక్కుతోచక బాధితుడు ఏసుబాబు ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వడం లేదంటూ పోలీసులను ఆశ్రయించగా పోలీసులు రాజశేఖర్ రెడ్డిపై బిఎన్‌ఎస్ చట్టం ప్రకారం చీటింగ్ కేసు -పీఎస్‌లో 316/2,318(4) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసులో నేరం రుజువైతే 5 ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉందని పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News