Friday, December 20, 2024

చీటింగ్ కేసులో ఇరుక్కున్న భారత క్రికెటర్

- Advertisement -
- Advertisement -

భారత క్రికెట్ జట్టులో ఒకప్పటి మీడియం పేస్ బౌలర్ శ్రీశాంత్ పై కర్ణాటకలో చీటింగ్ కేసు నమోదైంది. కొల్లూరులో శ్రీశాంత్ ఆధ్వర్యంలో స్టోర్ట్స్ అకాడమీ నిర్మిస్తున్నామని చెప్పి, రాజీవ్ కుమార్, వెంకటేశ్ అనే వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. అకాడమీ కోసం తాను 2019లో రూ.18.70 లక్షలు చెల్లించానని, అయితే వాళ్లు చెప్పిన స్థలంలో స్పోర్ట్స్ అకాడెమీ నిర్మించలేదని కన్నాపురానికి చెందిన బాలగోపాల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పైగా ఆ స్థలంలో వేరే నిర్మాణం పనులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దాంతో పోలీసులు రాజీవ్ కుమార్, వెంకటేశ్, శ్రీశాంత్ లపై చీటింగ్ కేసు నమోదు చేశారు.2007లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులోనూ, 2011లో క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టులోనూ శ్రీశాంత్ సభ్యుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News