రూ.3,14,526 తీసుకుని మోసం చేసిన నిందితుడు
అరెస్టు చేసి నగర సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: బిట్ కాయిన్స్ పేరుతో మోసం చేసిన నిందితుడిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. కర్నాటక, బెంగళూరుకు చెందిన ఆక్షయ్ గౌడా ఆన్‌లైన్‌లో బిట్ కాయిన్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన మనిష్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్ ద్వారా మనీష్ రెడ్డి డబ్బులు పంపించాగా బిట్‌కాయిన్ ట్రేడింగ్ చేసి వచ్చిన డబ్బులు పంపించేవాడు. ఇలా చాలా సార్లు డబ్బులు తిరిగి పంపించాడు. ఇలా బాధితుడికి నమ్మకం కుదిరేవరకు కమీషన్ డబ్బులు పంపించాడు.
తర్వాత భారీగా కమీషన్ ఇస్తానని ఎక్కువ మొత్తం డబ్బులు బిట్‌కాయిన్స్‌లో పెట్టాలని కోరాడు. దానికి అంగీకరించిన బాధితుడు రూ.3,14,526 పంపించాడు. డబ్బులు తీసుకున్న నిందితుడు తర్వాత నుంచి మనీష్ రెడ్డి ఫోన్స్, మెసేజ్‌లకు స్పందించడం మానివేశాడు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేసి నగరాకి తీసుకుని వచ్చారు. ఎస్సైలు లచ్చిరెడ్డి, నరేష్, పిసిలు ఫెరోజ్, మహేష్, రఘు, గజేశ్వర్, మోహన్ దర్యాప్తు చేశారు.