- Advertisement -
రూ.17లక్షలు ముంచి కేటుగాళ్లు
హైదరాబాద్: క్రిప్టో కరెన్సీతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నమ్మించి నిండాముంచారు సైబర్ నేరస్థులు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని అంబర్‌పేటకు చెందిన యువకుడికి ఫేస్‌బుక్‌లో సైబర్ నేరస్థులు పరిచయం పెంచుకున్నారు. కొద్ది రోజులు మంచిగా మాట్లాడిన తర్వాత సైబర్‌నేరస్థులు తమ ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టారు. యూకెలోని క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో పెట్టుబడి పెడితే తక్కువ వ్యవధిలో కోట్లాది రూపాయలను సంపాదించవచ్చని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు, అతడి స్నేహితుల వద్ద రూ.17లక్షలు కాజేశారు. తర్వాత నుంచి నిందితులు స్పందించడం మానివేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -