Wednesday, January 22, 2025

నకిలీ ఇన్సూరెన్స్ పేరుతో ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

Cheating in the name of fake insurance

రూ.3.5కోట్లు ముంచిన నిందితులు
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

మనతెలంగాణ,సిటిబ్యూరోః నకిలీ ఇన్సూరెన్స్ చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రామరాజు అమీర్‌పేట, మోతీనగర్‌లో ఉంటున్నాడు. కొద్ది రోజుల నుంచి నిందితులు కరీంనగర్‌కు చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్ గౌడ్, ఎపిలోని గుడివాడకు చెందిన సుబ్రహ్మణ్యం బాధితుడిని ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. పలుమార్లు ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ చేసుకోవాలని కోరడంతో ఒప్పుకున్నాడు.

దానికిగాను ఇన్సూరెన్స్ తీసుకున్న రామరాజు నిందితులు చెప్పినట్లు విడతల వారీగా రూ.3.5కోట్లు నిందితులకు ఇచ్చాడు. కొద్ది రోజుల క్రితం నిందితులు రామరాజుకు ఇన్సూరెన్స్ పత్రాలు ఇచ్చారు. వాటిని రామరాజు అమెరికాలో ఉంటున్న తన కుమారుడికి పంపించాడు. వాటిని తనిఖీ చేసిన రామరాజు కుమారుడు నకిలీవిగా తేల్చాడు. వెంటనే బాధితుడు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News