Sunday, December 22, 2024

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

Cheating in the name of love and marriage

డబ్బులు తీసుకుని మోసం చేసిన యువకుడు
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పి డబ్బులు తీసుకుని యువతిని మోసం చేసిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని తిరుపతి, తిమ్మినాయుడిపాలెనికి చెందిన వేలం సివతేజ వ్యాపారం చేస్తున్నాడు. బాధితురాలు వెయిట్ లాస్ క్లినిక్‌లో పనిచేస్తోంది. నిందితుడు 2016లో వెయిట్ లాస్ కోసం క్లినిక్‌లో యువతిని సంప్రదించాడు. అదే సమయంలో ఆమె పర్సనల్ మొబైల్ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. తాను కెనడాలో ఉద్యోగం చేస్తున్నానని, తిరుపతిలో తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని బాధితురాలికి అబద్దం చెప్పాడు.

తర్వాత యువతికి ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలోనే నిందితుడు వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఏప్రిల్, 2021లో యువకుడికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో బాధితురాలిని వివాహం చేసుకుంటానని చెప్పి మెడికల్, కన్‌స్ట్రక్చన్ తదితరాల పేరు చెప్పి పలుమార్లు రూ.7,13,053 తీసుకున్నాడు. దీంతో బాధితురాలు తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువతి ఫోన్, మెసేజ్‌లకు స్పందించడం మానివేశాడు. బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ కేసు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News