Friday, December 20, 2024

మంత్రాల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

మంత్రాల పేరుతో మోసానికి పాల్పడిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఫిలింనగర్‌కు చెందిన ఓ కుటుంబం తమకు ఎవరో చేతబడి చేశారని నమ్మారు. దీనికి ఓ మంత్రగాడిని సంప్రదించడంతో దానిని తొలగిస్తానని చెప్పి వారి ఇంటికి తన మనుషులను తీసుకుని వచ్చాడు. బాగు చేసుకోకుంటే కుటుంబం మొత్తం కూరుకు పోతుందని మంత్రగాడు చెప్పాడు. దీంతో భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు మంత్రగాడు చెప్పినట్లు చేశారు. వారి వద్ద ఉన్న పది తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదును తీసుకుని పారిపోయారు. మంత్రగాళ్లు పారిపోయారు, వారు వెళ్లిన తర్వాత చూసుకున్న కుటుంబ సభ్యులు తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News