Saturday, November 23, 2024

ప్రార్థనల పేరుతో మోసం

- Advertisement -
- Advertisement -

ఆప్తమాలజిస్ట్ వద్ద నుంచి రూ.12లక్షలు వసూలు చేసిన నైజీరియన్లు
అరెస్టు చేసిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: ప్రార్థనలు చేసి జాతకం మారేలా చేస్తామని, వ్యాపారం విజయవంతం అయ్యేలా చూస్తామని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, రౌటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కుషాయిగూడకు చెందిన యువతి ఆప్తమాలజిస్ట్‌గా పనిచేస్తోంది. తన ప్రేమ విషయం, కెరీర్‌లో ఎదుగుదల కోసం గూగుల్ లవ్ స్పెల్ క్యాస్టర్ గురించి వెతికింది. అందులో ఉగాండాకు చెందిన వారి మొబైల్ నంబర్ దొరికింది.

ఈ నంబర్‌ను నైజీరియాకు చెందిన ఒకుఉచికువు, ఒబిఉరువు జోనాథన్ ఉజకా, మైఖేల్‌అజుండా, డానియల్ గూగుల్ పెట్టారు. మైఖేల్ అజుండా, డానియల్ దుస్తుల వ్యాపారం చేసేందుకు ఇండియాకు వచ్చారు, వీరు పరారీలో ఉన్నారు. దుస్తుల వ్యాపారంలో నష్టాలు రావడంతో మోసాలు చేయడం ప్రారంభించారు. వాటికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, గూగుల్‌లో తమ మొబైల్ నంబర్లను ఆస్ట్రాలజర్, లవ్ స్పెల్ క్యాస్టర్ తదితరాల పేర్లతో పెట్టారు. వాటికి ఫోన్లు చేసిన వారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుషాయిగూడకు చెందిన బాధితురాలు వీరిని ఫోన్‌లో కాంటాక్ట్ చేసింది. ప్రేమ విషయంలో ప్రార్థనలు చేసేందుకు నిందితులు లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

కాని నిందితులు ప్రేమ విషయంలో బాధితురాలికి సలహా ఇవ్వకముందే ఆమె పరిష్కరించుకుంది. తర్వాత తన వ్యాపారం విజయవంతంగా నడిచేందుకు ప్రార్థనలు చేయాలని నిందితులను మళ్లీ సంప్రదించింది. ఈ సారి నిందితులు బాధితురాలి వ్యాపారం విజయవంతం అయ్యేందుకు ప్రార్థనలు చెస్తామని చెప్పి ఆమె వద్ద నుంచి రూ.12,42,105 వసూలు చేశారు. మళ్లీ డబ్బులు వసూలు అడుగుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ గౌడ్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News