Wednesday, January 22, 2025

ట్రావెలింగ్ పేరుతో ఛీటింగ్.. నిందితులకు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : విదేశాల్లోని పర్యటక ప్రాంతాలను చూపిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను సిటీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. వివేక్ జైన్ క్యూయూసి టూర్స్ డైరెక్టర్, రాజేష్ చంద్ గొరవత్ ఇద్దరు కలిసి టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. హైదర్‌గూడకు చెందిన రఫియా సుల్తానా సింగపూర్ టూర్ కోసం వీరికి రూ.38లక్షలు చెల్లించింది. పర్యటనలో భాగంగా అన్ని ఖర్చులు అందులోనే ఉండాటని మాట్లాడి డబ్బులు చెల్లించారు. తీరు బాధితులు సింగపూర్ వెళ్లిన తర్వాత నిందితులు డబ్బులు చెల్లించలేదని తెలియడంతో వీరు సొంత ఖర్చులు పెట్టుకుని పర్యటించారు. నగరానికి వచ్చిన తర్వాత నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సాక్షాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టగా తుది తీర్పు ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News