Tuesday, April 8, 2025

బట్టతలపై వెంట్రుకలంటూ మోసం..

- Advertisement -
- Advertisement -

ఫతేదర్వాజాకు క్యూకట్టిన జనం
రూ.200లకే గుండుపై తైలం
మంట, బొబ్బలతో ఆసుపత్రికి పరుగులు
పలాయనం చిత్తగించిన వకీల్

మన తెలంగాణ/చార్మినార్: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సోషల్ మీడియాలో చేసిన తెగ ప్రచారం కస్టమర్లను క్యూ కట్టేలా చేసింది. గుండుపై పూసిన చల్లటి తైలం చివరకు బొ బ్బలు, మంటలు తెప్పించింది. లబోదిబో మం టూ తైలం రాసిన వ్యక్తి వద్దకు వెళితే అతడు అ క్కడి నుండి పలాయనం చిత్తగించాడు. చివరకు గుండుపై వెంట్రుకలు రాకపోగ ఉన్నవి పోయా యి. ఈ సంఘటన కాలాపత్తర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది. వివరాల్లో కి వెళితే… ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి ఫతేదర్వాజా ప్రాంతంలోని ఒక ఖాళీ స్థలంలో చిన్నపాటి క్షౌరశాలను తెరిచాడు.

కేవలం 200 రూ పాయలకే బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ఒక వీడియాను సామాజిక మాధ్యమంలో వైరల్ చేశాడు. బిగ్‌బాస్ ఫేమ్ ఒకరికి బట్టతలపై జ ట్టు తెప్పించినట్లు చెప్పాడు. ఇంకేముంది జనం అతని తాత్కాలిక క్షౌరశాల వద్దకు బారులు తీ రారు. కస్టమర్లకు గుండు గీసి తన వద్ద గల తై లాన్ని రాశాడు. తైలం తొలుత చల్లగా ఉండటం తో జనం ఆ సమయంలో ఎలాంటి ప్రభావానికి లోను కాలేదు. ఎనిమిది రోజులపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ తరువాత బట్టతలపై జుట్టు ఒత్తుగా మొలుస్తుందని నమ్మబలికాడు. అతని అనుచరులు కొందరు తమకు పది రోజుల్లోనే మంచి ఫలితం కనిపించిందని జనాలను నమ్మేలా చేశారు. చివరకు బట్టతలపై తైలం రాసుకున్న వారికి మంటగా అనిపించి బొబ్బలు వచ్చాయి. వకీల్ పూసిన తైలంతో రియాక్షన్ అయినట్లు బాధితులు వాపోయారు. మంటలకు తాళలేక ఆసుపత్రికి పరుగులు తీశారు. అయితే ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News