Friday, December 20, 2024

టర్కీ కరెన్సీతో ఛీటింగ్.. ఐదుగురు నిందితుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః రద్దయిన టర్కీ కరెన్సీని మాయమాటలు చెప్పి విక్రయించేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, ఎల్‌బి నగర్ పోలీసులు కలిసి శుక్రవారం పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 27 కోట్ల రూపాయల విలువైన టర్కీ లీరా కరెన్సీ, కారు, వాకీటాకీలు రెండు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపి రాష్ట్రం, ఏలూరు, ఎడరవారివీధికి చెందిన మంచినీళ్ల ఓంనాగ ప్రసాద్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు, దెందులూరు మండలానికి చెందిన గుడిమేడ జ్యోతి రవితేజ, తోట వెంకట నాగరాజు, నిమ్మ గంటి జీవన్‌సత్య, మార్కుతి తేజ, పిల్లి బుజ్జి కలిసి రద్దయిన టర్కీ కరెన్సీని విక్రయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేయగా పిల్లి బుజ్జి పరారీలో ఉన్నాడు. ఏలూరుకు చెందిన ఓంనాగ ప్రసాద్‌కు ఎనిమిది ఏళ్ల క్రితం టర్కీ కరెన్సీని ఓ వ్యక్తి వద్ద నుంచి తీసుకున్నాడు.

అప్పటి నుంచి కరెన్సీని తక్కువ ధరకు ఎక్సేంజ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చి జ్యోతిరవితేజ,తోట వెంకటనాగరాజుఉ కలిసి విషయం చెప్పాడు. వచ్చిన లాభంలో మంచి వాటా ఇస్తానని వారికి చెప్పాడు. వీరిలో నాగరాజు అప్పటికే రద్దైన టర్కీ కరెన్సీ విషయం పల్లి బుజ్జికి చెప్పాడు. బుజ్జీ ఈ విషయం జీవన్ సత్య, తేజకు చెప్పాడు. పలువురు అమాయకులకు టర్నీ కరెన్సీకి ఇండియాలో ఎక్కువగా డిమాండ్ ఉందని, వీటిని కొనుగోలు చేస్తే ఎక్కువగా డబ్బులు వస్తాయని చెప్పి అంటకట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారి మధ్య సమన్వయం కోసం వాకీటాకీలను కొనుగోలు చేశారు. టర్కీ కరెన్సీ విషయం పోలీసులకు తెలియడంతో నిందితులను విజయవాడ బస్‌స్టాప్ వద్ద పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌బి నగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News