Monday, January 20, 2025

భవనాలపై గుర్తులకు ఉక్రెయిన్ అధికారుల చెక్

- Advertisement -
- Advertisement -

Check by Ukrainian authorities for markings on buildings

కీవ్ : ఉక్రెయిన్ లో రష్యాదాడులకు లక్షంగా పెట్టుకున్న భవనాలపై గుర్తులను చెక్ చేసుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికార వర్గాలు ప్రజలను హెచ్చరించాయి. యుద్ధ్దం మరింత తీవ్రమౌతున్న నేపథ్యంలో కీవ్ వంటి ప్రధాన నగరాల్లో బహుళ అంతస్తులు, గ్యాస్‌పైపులైన్లపై కొన్ని గుర్తులు కనిపించడాన్ని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ గుర్తుల్లో ముదురు ఎరుపు ఎక్స్ ఆకారం, బాణాల గుర్తులతో కొన్ని ఉంటున్నాయని, బహుశా అలాంటి భవనాలపై రష్యా దాడులు చేసే ప్రమాదం ఉంటుందని అధికార వర్గాలు హెచ్చరించాయి. కాంతి ప్రతిబింబించే ట్యాగ్స్ కూడా కొన్ని భవనాలపై కనిపిస్తున్నాయి. ఈ గుర్తులను తక్షణం పరిశీలించుకుని , అలాంటివి కనిపిస్తే వెంటనే నేలపై పడుకోవడం లేదా ఏదైనా రక్షణ కల్పించుకోవాలని హెచ్చరించారు. ఈ గుర్తులపై అధికారులకు తెలియజేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News