Wednesday, January 22, 2025

నిపుణులైన డ్రైవర్లతో ప్రమాదాలకు చెక్

- Advertisement -
- Advertisement -

దూర ప్రాంతాలకు సొంత డ్రైవింగ్ వద్దంటున్న
వాహన రంగ నిపుణులు

License without a driving test with new regulations
మన తెలంగాణ,సిటీబ్యూరో: సాధారణంగా ప్రతి పండగకు గ్రేటర్ ప్రజలు తమ సొంతూళ్ళకు వెళ్ళేందుకు సంబంధిత అధికారులు, ప్రత్యేక బస్సులు నడుపుతున్నా.. అదనపు రైళ్ళు వేస్తున్నా.. అవి కూడా సరిపోక పోవడంతో వారు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి కొన్ని సందర్భల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణంగా డ్రైవింగ్‌లో మెళుకవలు తెలియక పోవడమే కాకుందా వచ్చీ రానీ డ్రౌవింగ్‌లో జాతీయ రహదారులపై రావడమే అంటున్నారు వాహన రంగ నిపుణులు. చాలామంది అనుభవం ఉన్న డ్రైవర్లను కాదని, అనుభవం లేక పోయినప్పటికి దూర ప్రాంతాలకు వాహనాలను నడపడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయని చెబుతున్నారు. వాహన తప్పిదం, రోడ్డు ప్రమాదాల కంటే మానవ తప్పిదం కారణంగానే జరుగుతున్న ప్రమాదాల్లోనే కొంత మంది మృత్యుపాలు కావడమే కాకుండా అనేక మంది గాయాలు పాలవుతున్నట్లు చెబుతున్నారు. తరుచు జరిగే ప్రమాదాల్లో మానవ తప్పిదం కారణంగా 80 శాతం జరుగుతుంటే మరో 20 శాతం ఇతర కారణాలతో జరుగుతున్నాయంటున్నారు.

ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 7 వేల మంది మత్యుపాలవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా వృథా అవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రత కోసం కోట్లు వ్యయం చేస్తున్నప్పటికి మానవ తప్పిదం కారణంగా ప్రమాదాలు తగ్గడం లేదని సర్వేలు చెబుతున్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు నిపుణులైన డ్రైవర్లను వదిలి సొంతంగా నడుపుకుంటూ పోవడంతో ప్రమాదాలు జరుగున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళే తమ సొంత వాహనాల్లో వెళ్ళాలనుకునేవారు రిస్క్ తీసుకోకుండా డ్రైవర్లను నియమించుకుంటే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందంటున్నారు. వాహనాలు రన్నింగ్‌లో ఉన్న సమయంలో టైర్ పోలిపోయినా, పంక్చరైనా వాహనాన్ని కంట్రోల్ చేసుకునే సామర్థం నిపుణులైన డ్రైవర్లుకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

* కారులో దూర ప్రయాణానికి సొంత డ్రైవింగ్ కంటే మంచి అనుభవం ఉన్న రెగ్యులర్ డ్రైవర్లను తీసుకెళ్ళాలి.
* పార్ట్‌టైమ్ డ్రైవర్‌ను తీసుకెళ్తున్నట్లయితే అతని డ్రౌవింగ్ అనుభవం గురించి క్లారిటీ తీసుకోవాలి.
* కారులో దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలనుకున్నప్పుడు వాహన టైర్ల కండీషన్, హెడ్‌లైట్లకు సంబంధించి నిపుణులు అభిప్రాయం తీసుకోవాలి.
* కారుముందు అద్దంపై క్రాక్ వచ్చినా, విజిబుల్టీ (చూసే సామర్థం) సరిగ్గా లేక పోయినా ఎదురుగా వచ్చేవాహన లైటింగ్ రిప్లెక్ట్ అవుతుంది. ముందు దారి సరిగ్గా కనిపించదు. ఇటువంటి సమయంలో గ్లాస్‌ను తప్పకుండా మార్చాలి.
* కారు హెడ్‌లైట్స్ విజబుల్ సరిగ్గా లేక పోతే వెంటనే వాటిని స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవాలి.
* కారు కండీషన్,బ్రేక్, ఇంజన్ ఆయిల్ , టైర్లలో ఎయిర్ ప్రెషర్స్ వంటి వాటిని తప్పకుండా చెక్ చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News