Monday, January 20, 2025

విద్యుత్ అంతరాయాలకు చెక్

- Advertisement -
- Advertisement -

సరఫరా వ్యవస్థ మరింత పటిష్టం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలకు చెక్ పెట్టేవిధంగా డిస్కమ్‌లు మరిన్ని చర్యలు చేపట్టాయి.విద్యుత్ సరఫరా విషయంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ గతంతో పోల్చుకుంటే చాలా మెరుగైన స్థాయికి చేరుకుంది. విద్యుత్ అంతరాయాలు , అంతరాయం సమయాల్లో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నది. గత ఏడాది జనవరి నుండి మే నెల వరకు వున్న అంతరాయాలు ప్రస్తుత సంవత్సరంతో (జనవరి నుండి మే వరకు) పోల్చుకుంటే దాదాపు 33 కేవీ స్థాయిలో 43.5 శాతం క్షీణతను నమోదు చేసాయి. నెలలో సరాసరిగా ఒక 33 కేవీ ఫీడెర్ పరిధిలో గతంలో 47.3 నిమిషాల అంతరాయం ఉండగా, ప్రస్తుతం 26.7 నిమిషలుగా వున్నది. అదే విధంగా ఒక 11 కేవీ ఫీడెర్ పరిధిలో గతంలో 17.16 నిమిషాల అంతరాయం ఉండగా ప్రస్తుతం 13.31 నిమిషాలుగా వుంది. తెలంగాణ రాష్ట్రం లో మొత్తం ఒక కోటి 80 లక్షల వినియోగదారులుండగా, వాటిలో ఒక కోటి పద్నాలుగు లక్షల వినియోగదారులకు, అంటే దాదాపు 63.33 శాతం వినియోగదారులకు దక్షిణ డిస్కం ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది.

Electricity charges

ప్రస్తుతం దక్షిణ డిస్కం లో 11 కేవీ ఫీడర్లు 8546; 33 కేవీ ఫీడర్లు 1422 వున్నాయి. దీనికి తోడు 2.48 లక్షల కిలోమీటర్ల ఎల్‌టి లైన్, 1.17 లక్షల కిలోమీటర్ల 11 లైన్, 16000 కిలోమీటర్ల 33 కేవీ లైన్స్ వున్నాయి. భారీ వర్షాలు, పెను గాలులు ఏర్పడినపుడు చెట్లు, వాటి కొమ్మలు విద్యుత్ స్తంభాలపై కూలడం వలన, ఎల్‌టి లైన్ల పై చెట్ల కొమ్మలు పడటం, బ్యానెర్లు, ఫ్లెక్సీ వంటి ఇతర వస్తువులు లైన్ల పడటం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది నిర్వహించే నిర్వహణ ,మరమ్మత్తు పనులను సమర్ధవంతంగా నిర్వహించడం, తరచుగా అంతరాయాలు రికార్డు అవుతున్న ఫీడర్ల పై ప్రత్యేక ద్రుష్టి పెట్టడం వలన ఈ అంతరాయాలను తగ్గించగలుగుతున్నారు.

దక్షిణ విద్యుత్ పంపిణి సంస్థ, విద్యుత్ అంతరాయాలు మరియు ట్రిప్పింగ్ లు ఏర్పడటానికి గల మూలకారణాలపై ఒక అధ్యయనాన్ని నిర్వహిస్తున్నది. దాని ఆధారంగా 33 , 11 కేవీ స్తంభాల ఛానెల్,ఆర్మ్ లో వినియోగించే మెటల్ లో చేయాల్సిన మార్పులు, ట్రాన్స్ ఫార్మర్ ఏబి స్విచ్ ల వద్ద తరచూ జంపర్ కట్ వలన అంతరాయాలు కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, హెచ్‌జి ఫ్యుజ్, డిటిఆర్ స్ట్రక్చర్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై అధ్యయనం నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News