Thursday, January 23, 2025

స్వాధీనం చేసుకున్న వాహనాలు చెక్‌చేసుకోండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసులు వివిధ సందర్భల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వెంటనే వివరాలతో సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు వాహనాల తనిఖీలు తదితర వాటిల్లో సైబరాబాద్ పోలీసులు 885 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో పార్కింగ్ చేశారు. ఆ వాహనాల వివరాలు www.cyberabadpolice.gov.inలో తనిఖీ చేసుకోవాలని కోరారు.

వాహనాలను చెక్‌చేసుకుని వారి యొక్క వాహనం ఉన్నట్లైతే వెంటనే తగిన ఆధారాలతో పోలీసులను సంప్రదించాలని కోరారు. ఆరు నెలలోపు సంప్రదించి వాహనాలను తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరు నెలల తర్వాత వాహనాలను వేలం వేస్తామని స్పష్టం చేశారు. వివరాల కోసం ఎంటిఓ విష్ణును సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News