Monday, January 20, 2025

మధ్యాహ్నభోజనం తనిఖీ

- Advertisement -
- Advertisement -

వనపర్తి: వనపర్తి మున్సిపల్ పరిధిలోని 18,19 వార్డులలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పట్టణ అభివృద్ధి నివేదిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గాంధీనగర్, హరిజనవాడ, ఇందిరా కాలనీలో బిఆర్‌ఎస్ శ్రేణులు , పట్టణ పార్టీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ 18వ వార్డులోని పిఎస్ గాంధీనగర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో నాణ్యమైన పోషక విలువలను అందించే ఆహారం పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందించడంలో కృషి చేస్తుందని, ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు సైతం సన్నబియ్యంతో వంట చేయడంతో పాటు గుడ్లు, అరటి పండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నేటి బాలలు రేపటి పౌరులని గుర్తించి మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. 18,19 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఇంటింటికి వివరిస్తూ నిరంజన్ రెడ్డికి మరొక్కసారి ఆదరించాల్సిందిగా పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News