Wednesday, January 22, 2025

ఓటరు జాబితాను సరి చూసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన వికారాబాద్ అదనపు కలెక్టర్

కోస్గి: కొత్తగా ఓటరు నమోదు,ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు ఓటరు జాబితాను సరి చూసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్,ఎన్నికల రిటర్నింగ్ అధికారి లింగ్యానాయక్ అన్నారు.ఆదివారం మండలంలోని సర్జాఖాన్‌పేట్ గ్రామంలోని 157,158,159 పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పరిశీలించారు.

వచ్చే నెల 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తహాశీల్ధార్ బక్క శ్రీనివాసులు,ఆర్‌ఐ సుభాష్‌రెడ్డి,సిబ్బంది హర్షవర్థన్,బుగ్యాసాబ్,హన్మంతులతో పాటు బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

18 ఏండ్లు పైబడిన వారందరు ఓటు నమోదు చేసుకోవాలి

అతి త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ నూతన ఓటరు కార్డు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ బక్క శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండలంలోని కడంపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని వారు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకు ముందు ఓటరు కార్డు కలిగి ఉన్న వారు తప్పులు ఏమైన ఉంటే బిఎల్‌ఓల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సెప్టెంబర్ 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ మళ్లీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.కార్యక్రమంలో ఆర్‌ఐ సుభాష్‌రెడ్డి,సిబ్బంది బుగ్యాసాబ్,హన్మంతులతో పాటు బిఎల్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News