Thursday, January 23, 2025

అక్రమ మైనింగ్‌కు ట్రాకింగ్‌తో చెక్

- Advertisement -
- Advertisement -
  • ఖనిజాలు తరలించే వాహనాలకు జిపిఎస్ అమర్చే యోచన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో యథేచ్ఛగా సాగుతున్న దోపిడీ
  • రాయల్టీ, సీనరేజ్ ఎగవేతదారులపై కఠిన చర్యలకు సర్కార్ నిర్ణయం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఖజానాకు గండికొడుతున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు గ నుల శాఖ సిద్ధమైంది. రాయల్టీ, సీనరేజ్ ఎగవేతదారులపై చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో అక్రమాలకు తావు లేకుండా ప్రత్యేకంగా యాప్‌తో పాటు, గనుల నుంచి ఖనిజాలు తరలించే వాహనాలను జీపిఎస్ ద్వారా ట్రాకింగ్ చేసేలా చర్యలు చేపడుతోంది. గనుల శాఖ వద్ద రిజిస్ట్రర్ చేసుకున్న వాహనాలనే రవాణాకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది.

దీనిద్వారా తెలంగాణలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్ దందాను అరికట్టవచ్చని మైనింగ్ అధికారులు భావిస్తున్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జి ల్లాల్లో అక్రమ మైనింగ్ ) తీవ్రత అధికంగా ఉన్న ట్లు గనుల శాఖ అధికారులు గుర్తించారు. ము ఖ్యంగా ఆ జిల్లాల్లోని క్వారీల నుంచి కంకర తీసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భవన నిర్మాణాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ అనేక అ క్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమాలను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమవుతోంది.

అయితే కాంట్రాక్టర్‌లు లీజు తీసుకున్నది ఒకచోటయితే ఆ చుట్టుపక్కల తవ్వకాలు సాగిస్తుండటం, తవ్వితీసిన ఖనిజానికి రాయల్టీ, సీనరేజ్ చెల్లించకుండా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటుండటం ఏళ్ల తరబడిగా సాగుతోంది. ఇలా ఖనిజాలను దాచేసి సాగుతున్న ఆ దందాపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఖజానాకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి కఠినంగా వ్యవహారించాలని ఆదేశించిడంతో మైనింగ్ అధికారులు గతంలో ఎన్నడూలేని విధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. లీజుప్రాంతాల్లో జరిగిన మైనింగ్, ఖనిజాల్ని రవాణా చేస్తున్న వాహనాల ను విస్తృతంగా తనిఖీ చేస్తుండగా పలు అక్రమా లు వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య రోజుకు 60 చొప్పున కేసులను నమోదు చేస్తున్నారు.

ఖనిజాల్ని రవాణాచేసే వాహనాలకు జీపిఎస్ ట్రాకింగ్
లీజుదారులు తవ్వితీసిన ఖనిజానికి మేజర్ మినరల్ అయితే రాయల్టీ రూపంలో మైనర్ మినరల్ అయితే సీనరేజ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి వేబిల్లు తీసుకోవాలి. అయితే ప లువురు లీజుదారులు రాయల్టీ, సీనరేజ్ ఎగవేత కు పాల్పడుతూ ఖనిజాన్ని తీసి అమ్మేసుకుంటున్నారు.

అనేక గనుల నుంచి వేబిల్లులు లేకుండానే తరలిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడటంతో కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల అ నుమతి పొందిన లీజు స్థలాన్ని దాటేసి పక్కనున్న ప్రభుత్వ భూము ల్లో అక్రమంగా కంకర, గ్రానైట్, క్వార్ట్, ఇసుకను తవ్వుతున్నారు. అనుమతి తీసుకున్నా పరిమితికి మించి తవ్వుతున్నారు. కొన్నిచోట్ల లీజు గడువు దాటినా యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడే వారు ప్రైవేటు నిర్మాణాలకు వాటిని సరఫరా చే స్తున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వద్ద రిజిస్టర్ చేసుకున్న లారీలకే రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అనమతి ఇస్తున్నారు.

లీజుప్రాంతాలు, క్వారీల నుంచి ఖనిజాల్ని తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని గ నుల శాఖలో రిజిస్టర్ చేసుకునే నిబంధన తీసుకురానున్నారు. ఖనిజాల్ని రవాణాచేసే వాహనాలకు జీపిఎస్ అమర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని గనులశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్లు తెలిసింది. మైనింగ్ లీజుప్రాంతాన్ని అ క్షాంశాలు, రేఖాంశాలతో పక్కాగా గుర్తించేలా జియో కో ఆర్డినేట్ చేస్తున్నారు. గని నుంచి ఖనిజాన్ని తీసుకెళ్లే వాహనాలు గమ్యస్థా నం చేరేవరకు ట్రాకింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News