Friday, November 22, 2024

ఎన్నికల సమయంలో చెక్‌పోస్ట్‌లు కీలక పాత్రను పోషిస్తాయి

- Advertisement -
- Advertisement -
  • సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి
  • జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్

మెదక్ ప్రతినిధి: రానున్న సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించే విధంగా కృషి చేయాలని పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు రాబోయే ఎన్నికల సంధర్భంగా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చెక్ పోస్ట్‌లు కీలకపాత్ర పోషిస్తాయని, సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని అన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి జిల్లా పోలీసు సిబ్బంది సన్నద్దంగా ఉండాలని, ఎన్నికల నియమావళి, భద్రత చర్యల సందర్భంగా పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాటించాలని నియమాలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమంలో వివరించారు. రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరు ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని సూచించారు.

ఎన్నికల కమీషనర్ అధికారి ఆదేశాల మేరకు పోలీసు అధికారుల మధ్య సంబంధం మరింత మెరుగుపడేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలు, మార్గదర్శకాలను తెలియజేసారు. జిల్లాకు అక్రమ మార్గాలలో అనుమతులు లేనటువంటి వాటిని తరలించడానికి ప్రయత్నిస్తే అరికట్టేందుకు అందర జిల్లా మరియు చెక్ పోస్ట్‌ల నుందు చర్యలు తీసుకోవాలని, ఇత శాఖల సమన్వయం అంశాలపై సిబ్బందికి వివరించారు. ఏర్పాటు ఏసిన ప్రతి చెక్ పోస్ట్ వద్ద నిరంతర సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి చిన్న అసాంఘఇక సంఘటనలు జరుగినా పోలీసు తక్షణమే చేరుకొనే విధంగా నిరంతర అప్రమత్తతో విధులను నర్వర్తించాలని, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మంచి సత్సంబంధాలు పెంపొందించుకొని సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలన్నారు.

ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో సంభాషించార. అక్రమ మార్గంలో మధ్యం, డబ్బులు, గంజా, రాజకీయంగా లబ్దిని పొందే ఎటువంటి వస్తువులను ఇతర అసాంఘిక కార్యకలాపాలు రానివ్వకుండా అన్ని మార్గాలలో తగు నిఘాను ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని సూచించారు. జిల్లాలో సోషల్ మీడియాపై ఒక ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ఎన్నికలపై ఎటువంటి అసత్య ప్రచారాలను ఫేక్ మేసేజ్‌లను పంపించే వ్యక్తులను వెనువెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆలాగే జిల్లాలో ఎన్నికల పరిధిలోకి చ్చే ఆరు నియోజకవర్గాలైన మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, ఆందోల్, నారాయణఖేడ్ లలో ఎన్నికల సమయంలోపోలీసు అధికారులు ఎలక్షన్ ముందు ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన ఉండాలని, ఎలక్షన్ సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగివుండి పకడ్బందీగా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News