Sunday, December 29, 2024

పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ భద్రతా సిబ్బంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : క్యాసినోలు నిర్వహిస్తూ గతంలో పోలీసులకు చిక్కిన చీకోటి ప్రవీణ్ మరోసారి వివాదాల్లో నిలిచాడు. బోనాల సంద ర్భంగా లాల్ దర్వాజ అమ్మవారిని ఆదివారం చీకోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గన్స్‌తో ఆలయం లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వద్ద గన్స్‌ను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గన్ లైసెన్స్‌లపై ఆరా తీస్తున్నారు. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వెపన్స్‌కు లైసెన్స్ లేకపోతే కేసులు నమోదు చేస్తామని  స్పష్టం చేశారు. చీకోటి ప్రవీణ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సిబ్బందిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని చీకోటి ప్రవీణ్ ఆరోపించాడు. అమ్మవారి దర్శనానికి వస్తే అడ్డుకుని, అవమానించారంటూ చీకోటి ప్రవీణ్ ఓవరాక్షన్ చేశాడు. ఆలయంలోకి వెపన్స్‌తో రావడం నేరమని తనకు కూడా తెలుసన్న ప్రవీణ్ సెక్యూరిటీ వద్ద లైసెన్స్‌డ్ గన్‌లే ఉన్నాయన్నారు. సెక్యూరిటీని చెక్ చేసి పంపుతామన్న పోలీసులు ఇలా అడ్డుకున్నారని వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News