Friday, December 20, 2024

కటకటాల్లోకి క్యాసినో కింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను థాయిలాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మరోసారి చీకోటి ప్రవీణ్ వార్తల్లో నిలిచాడు. థాయి లాండ్‌లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు పటా యాలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాం బ్లింగ్ ముఠాను అరెస్టు చే శారు. ఈ 90మందిలో చీ కోటి ప్రవీణ్ కూడా ఉన్నాడని సమాచారం. అంతేకాదు ఈ ము ఠాలో మహిళలు 14 మంది ఉన్నారని వా ర్తలు గుప్పుమంటున్నాయి. ఈ 90 మంది నుంచి భారీగా నగదును గేమింగ్ చిప్స్‌ను థాయిలాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ గ్యాంబ్లింగ్ అంతా చీకోటి ప్రవీణ్ నేతృత్వంలోనే నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 కోట్ల రూపాయల నగదు, ఎనిమిది క్లోజ్డ్ స ర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్లు, మూడు నోట్ బుక్‌లను పోలీసులు సీజ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ముఖ్య నేరస్తుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్‌ను స్పెషల్ బృం దాలు అదుపులోకి తీసుకున్నాయని అత డిని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇక పటాయ పోలీసు ల అదుపులో చీకోటి ప్రవీణ్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ దే వేందర్ రెడ్డి, మాధవరెడ్డి కూడా ఉన్నారు.

పోలీసులను చూసిన వెంటనే తప్పిం చు కోవడానికి ఈ ముఠా ప్రయత్నించినట్లుగా తెలు స్తోంది. కాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి మరీ పట్టుకున్నట్లు సమాచారం. థాయిలాండ్‌లో కఠినమైన చట్టాలు ఉంటాయి. నేరం చేసినట్లు నిరూపితమైతే చాలా దారుణమైన శిక్షలు పడతాయి అన్న విషయం తెలిసిందే. దీంతో, చీకోటి ప్రవీణ్ దొరికిపోవడం తో అతని మీద ఎలాంటి శిక్షలు పడతాయోనని అతని అనుచరుల్లో ఆందో ళన నెలకొంది. థాయి లాండ్‌లోని ఒక హోటల్లో ఏప్రిల్ 27 నుంచి అందులోనే కాన్ఫరె న్స్ హాల్‌ను రెంటుకి తీసుకొని ఈ గ్యాంబ్లింగ్ తతంగం నడుపుతున్నట్లుగా వెలు గు చూసింది. ఈ వ్యవహారంలో ఓ మహిళ కీలకంగా ఉన్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసు కుని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, హోటల్ లోని కన్వెన్షన్ హాల్ మొత్తాన్ని బుక్ చేసుకున్నామని, అక్కడకు ఎవరినీ అనుమతిం చకుండా ఒక్క హోటల్ స్టాఫ్ కు మాత్రమే అనుమతించేలా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

అయితే కార్డులు, కార్డు డీలర్స్, గ్యాంబ్లింగ్ సామాగ్రి మొత్తం ఇండియా నుంచే వచ్చిందని తనకు సంబంధంలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. వచ్చిన వారంతా రేయింబవళ్లు ఈ జూదం ఆడుతున్నట్లుగా పట్టాయ పోలీసులు ప్రకటించారు. తాను విదేశాల్లో గ్యాంబ్లింగ్, కేసినోలు నిర్వహస్తానని చీకోటి ప్రవీణ్ బహిరంగం గానేప్రకటించారు. అయితే ధాయీలాండ్‌లో గ్యాంబ్లింగ్ చట్టబద్దమేనని చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని వాదించేవారు. కానీ ఇప్పుడు పట్టాయలోనే చట్ట వ్యతిరేకమని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జైలుకు పంపడం సంచలనంగా మారింది. గ్యాంబ్లింగ్‌కు మించి ఏదో చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నెండు మంది మహిళలు కూడా పట్టుబడటం అసలు వెళ్లిన వారు అంతా ఎవరు అన్నదానిపై చర్చజరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News