Saturday, November 16, 2024

చీమలపాడు ఘటన….. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్:  బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, లోకసభలో బిఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వర్ రావులతో కలిసి చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గురువారం ఉదయం మంత్రులు కెటిఆర్, అజయ్ కుమార్, ఎంపి నాగేశ్వరరావులతో పాటు నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. అందులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పరామర్శించి ప్రభుత్వం, పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసాన్నిచ్చారు. వారు నిమ్స్ అధికారులు, వైద్యుల బృందంతో మాట్లాడి మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. గాయపడిన వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలని, వీరి సహాయకులు, కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండాల్సిందిగా నిమ్స్ ఒఎస్డి డాక్టర్ గంగాధర్, డైరెక్టర్ డాక్టర్ బీరప్పలకు కేటీఆర్ పలు సూచనలు చేయడంతో పాటు సలహాలిచ్చారు.

Also Read:  ’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News