Saturday, December 21, 2024

లేగ దూడపై చిరుత దాడి.. భయాందోళనలో గ్రామస్థులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి లేగదూడపై చిరుతపులి దాడిచేసిన ఘటన లేగ దూడ యజమాని ఉదయం చూడగా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారుల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందల్వాయి, అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామ శివారులో తోట మనోజ్‌కుమార్‌కు చెందిన కొట్టంలో లేగదూడపై తెల్లవారుజామున చిరుత దాడి చేసింది. ఉదయం చూసేసరికి లేగదూడ, మరణించి ఉండడంతో సదరు యజమాని వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అధికారులు, వినయ్, శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈవిషయమై అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ రవిమోహన్ భట్ను సంప్రదించగా చిరుతదాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కాగా చిరుత సంచరిస్తున్న వార్తతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ యానం, సుద్దులం చుట్టుపక్కల గ్రామాల వారు చిరుత సంచరిస్తున్న వైపు వెళ్లకూడదని సూచించారు. త్వరగా చిరుత పులిని రవి శాఖ అధికారులు పట్టుకొని అటవీ రేంజ్ ప్రాంతానికి తరలిస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News