- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు సింగనపల్లిలో వాహనం ఢీకొనడంతో చిరుత చనిపోయింది. గుర్తు తెలియన వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. వాహనదారులు గమనించినప్పటికి చిరుత వద్దకు వెళ్లేందుకు వెనకడుగు వేశారు. కొన ఊపిరితో ఉన్న చిరుత తీవ్ర గాయాలతో కన్నుమూసింది. వాహనదారుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెటర్నరీ వైద్యులతో వైద్య పరీక్షల అనంతరం చిరుత కళేబరాన్ని భూమిలో గుంత తీసి పాతిపెట్టనున్నారు.
- Advertisement -