Friday, January 10, 2025

తిరుమలలో చిరుత సంచారం… చిన్న పిల్లల చేతికి ట్యాగ్

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో చిరుత సంచారంతో నడకదారిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. 7వ మైలు వద్ద చిన్న పిల్లల చేతికి పోలీసులు సిబ్బంది ట్యాగ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లు ఏర్పాటు చేశారు. ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, పోలీస్ టోల్‌ఫ్రీనంబర్ ఉంటుందన్నారు. తిరుమల నడకదారిలో 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతిపై ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు తరువాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేశారు. చిరుతల సంచారం దృష్టా పిల్లలకు అనుమతిపై టిటిడి ఆంక్షలు విధించింది.

Also Read: కారు-బైక్ ఢీ.. ఒకరు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News